26 Aug
26Aug

బాలకృష్ణ  చేసిన ఫ్యాక్షన్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ మూవీ తర్వాతనే తెలుగు చిత్ర పరిశ్రమలు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. అందువల్ల ఈ మూవీ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘనవిజయం సాధించింది.


వాస్తవానికి సమరసింహారెడ్డి సినిమా కథ ఆశామాషీగా తయారవ్వలేదు. రచయిత విజయేంద్ర ప్రసాద్ 30 కథలను చెప్పారట. చివరికి మూవీ కథను దర్శకుడు బి.గోపాల్ ఓకే చేశారట. దీంతో ఈ కథను బాలయ్యకు వినిపించగానే ఆయన ఇక మారు మాట్లాడకుండా వెంటనే ఓకే చెప్పేశారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎట్టకేలకు ఈ మూవీ 1999వ సంవత్సరంలో జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

News Source: Telugu Action



Comments
* The email will not be published on the website.
I BUILT MY SITE FOR FREE USING